అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మక్బూల్ భాష మానవత్వం చాటారు. రొళ్ల బస్టాండ్ ఆవరణలో.. ఓ మహిళ హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన ఎస్సై మక్బూల్ భాష.. వెంటనే ప్రైవేటు వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కరోనాను లెక్కచేయకుండా.. ఎస్సై చేసిన సేవను ప్రజలు అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: