అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో చోరీ జరిగింది. స్థానిక కోటవీధిలోని మేకల లక్ష్మన్న అనే రైతు ఇంట్లో బంగారు, వెండి వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితుడు చెప్పాడు. శనివారం రాత్రి లక్ష్మన్న ఇంట్లోవాళ్లు పడుకున్న తర్వాత తన కుమార్తె పెళ్లి కోసం సమకూర్చుకున్న 20 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి, రూ.15,000 విలువ చేసే చీరలు దొంగిలించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి: భయపెడుతున్న వరుస దొంగతనాలు