రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి జగదీష్ అన్నారు. నివర్ తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 15 నుంచి రహదారుల దిగ్బంధ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మొదట తపోవనం రోడ్డును దిగ్బంధం చేస్తామని.. దీనికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ల దిగ్బంధం కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'త్వరలో అనంతపురం జిల్లాకు చంద్రబాబు'