Road Accident In Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు విద్యానగర్ కాలనీలో ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైల్వే ఉద్యోగి ఓబుళపతి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి షేక్షావలికి తీవ్ర గాయాలయ్యాయి. గుంతకల్లు భాగ్యనగర్‌లో నివసిస్తున్న ఓబుళపతి, షేక్షావలి ఇరువురు కలిసి గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని దేవనహళ్లి రైల్వే స్టేషన్లో ట్రాక్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం ఉదయం బైక్‌లో వెళ్తుండగా ఆలూరు వైపు నుంచి గుంతకల్లు వస్తున్న టిప్పర్ బైకు ఢీకొంది. షేక్షావలిని చికిత్స నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ రామసుబ్బయ్య పరిశీలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై గుంతకల్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓబుళపతి మృతదేహాన్ని గుంతకల్ ప్రభుత్వ తరలించారు.
ఇవీ చదవండి