ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ఒకరు మృతి - అనంతపురం లెటెస్ట్ న్యూస్

అనంతపురం జిల్లా రాంపురం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని.. ప్రమాదవశాత్తు వెనుక వస్తున్న బస్సు కింద పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ...ఒకరు మృతి
author img

By

Published : Nov 2, 2019, 1:06 PM IST

రెండు ద్విచక్రవాహనాలు ఢీ...ఒకరు మృతి

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం సమీపంలో పెనుకొండ-పుట్టపర్తి ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వెనుక వస్తున్న బస్సు కింద పడి మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానికులు పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన నారాయణరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇతను కియా అనుబంధ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తోన్న ద్విచక్ర వాహనం ఢీ కొని కింద పడిపోయాడు. వెనుక నుంచి వస్తోన్న బస్సు అతనిపై నుంచి వెళ్లడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'కేసుల నుంచి తప్పించుకునేందుకే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం'

Intro:ap_atp_57_01_road_accident_one_dead_av_ap10099
Date:01-11-2019
Center:penukonda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMPID:AP10099
ద్విచక్ర వాహనాలు ఢీ..బస్సుకింద పడి ఒకరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు...

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం సమీపంలో పెనుకొండ-పుట్టపర్తి ప్రధానరోడ్డు పై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.. రోడ్డు మీద పడిన ద్విచక్ర వానదారుడి పై వెనకనే వస్తున్న బస్సు ఎక్కి పోవడంతో ఆ యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి..గాయపడ్డ వ్యక్తిని వెంటనే పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసుల వివరాల మేరకు మండలంలోని శెట్టిపల్లికి చెందిన నారాయణ రెడ్డి(21) కియా అనుబంధ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నడు. శుక్రవారం రాత్రి డ్యుటీకీ ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో కింద పడిపోయాడు. వెనుక వచ్చిన బస్సు నారాయణరెడ్డి పై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు... అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు...Body:ap_atp_57_01_road_accident_one_dead_av_ap10099Conclusion:ap_atp_57_01_road_accident_one_dead_av_ap10099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.