ETV Bharat / state

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం - గాండ్లపెంట రోడ్డు ప్రమాదం తాజా సమాచారం

అనంతపురం జిల్లా గాండ్లపెంట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కల్లుబాయి తండాకు చెందిన వెంకటరమణ, నరసింహులు నాయక్​లు గాండ్లపెంట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త సంవత్సరం తొలి రోజే రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదం నెలకొంది.

road accident at gandlapenta ananthapuram district two people died
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
author img

By

Published : Jan 1, 2021, 12:55 PM IST

అనంతపురం జిల్లా గాండ్లపెంట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కల్లుబాయి తండాకు చెందిన వెంకటరమణ, నరసింహులు నాయక్​లు గాండ్లపెంట నుంచి స్వగ్రామానికి సూపర్ ఎక్సెల్​లో బయలుదేరారు. రెక్కమాను నుంచి గాండ్లపెంటకు వస్తున్న మరో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి సూపర్ ఎక్సెల్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ, నరసింహులు నాయక్​లను 108 వాహనంలో చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు ఇద్దరిని అనంతపురం తరలించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ , నరసింహులు నాయక్​లు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న గాండ్లపెంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్త సంవత్సరం తొలి రోజే రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇదీ చదవండి: చేనేత కార్మికురాలి బలవన్మరణం... అనారోగ్యమే కారణమా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.