అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హానిమిరెడ్డి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహంపై వెళ్తున్న తండ్రి, కొడుకును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కొడుకు సాయి (15) మృతి చెందాడు. తండ్రి శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. తండ్రి, కొడుకులు వ్యవసాయ పనుల కోసం ద్విచక్రవాహంపై పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఇదీ చదవండి : నేటి నుంచి రైళ్ల సేవలు షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదే