ETV Bharat / state

అక్రమంగా మట్టి తరలింపు... అడ్డుకున్న అధికారులు

అనంతపురం జిల్లా కదిరి మండలంలో ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టి తరలింపు యత్నాన్ని రెవెన్యూ అధికారులు అఢ్డుకున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Revenue officials preventing illegal soil movement in anantapur district
అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
author img

By

Published : Feb 21, 2021, 2:49 PM IST

ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టి తరలింపును రెవెన్యూ అధికారులు అడ్డుకున్న ఘటన... అనంతపురం జిల్లా కదిరి మండలంలో జరిగింది. కే. బ్రాహ్మణపల్లి పంచాయతీలోని ప్రభుత్వ భూమిపై కొందరు నాయకుల దృష్టి పడింది. దాదాపు నాలుగు ఎకరాల భూమిని చదును చేసి అందులోని మట్టిని అక్రమంగా తరలించేందుకు సిద్ధమయ్యారని స్థానికులు తెలిపారు.

వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా... అక్కడికి చేరుకున్న అధికారులు మట్టి తరలింపును అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకుంటామని... తహసీల్దార్ మారుతి తెలిపారు. భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఎట్టకేలకు పెట్రో బాదుడుకు బ్రేకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.