ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తికి పదవీ విరమణ వేడక ఘనంగా చేస్తారు. అనంతపురం జిల్లాలోనూ ఇలా రిటైర్ అయిన ఓ ఉద్యోగికి ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే.. ఇక్కడ వీడ్కోలు పలికింది.. పోలీసు శాఖలోని జాగిలానికి.
పోలీసులకు నిత్యం తోడుంటూ క్రిమినల్స్‌ను పట్టించడమే కాక.. అనేక కేసులు చేధించడానికి ఉపయోగపడిన జాగిలానికి... గుంతకల్లు రైల్వే పోలీసులు పదవి విరమణ వేడుక చేశారు. రైల్వే రక్షక దళంలో 11 సంవత్సరాలుగా బాంబ్ స్క్వాడ్, ట్రైన్ తనిఖీలు వంటి ఎన్నో సేవలందించిన 'సుల్తాన్' అనే శునకానికి గౌరవంగా వీడ్కోలు పలికారు. పూలమాలతో అలంకరించి... శాలువతో సత్కరించారు. అనంతరం బాణా సంచా కాల్చి సంబరాలు చేశారు. సుల్తాన్ ను జంతు సంరక్షణ శాలకు తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: