ETV Bharat / state

PROTEST: అనంతపురం కలెక్టరేట్ వద్ద కళాకారుల ఆందోళన - ananthapuram latest protest

అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద రాయలసీమ ప్రాంత కళాకారులు కన్నీటి దీక్ష చేపట్టారు. కరోనాతో ఉపాధి కోల్పోయి, అవస్థ పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రేషన్ కార్డులు, కళాకారులు కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతపురం కలెక్టరేట్ వద్ద కళాకారుల ఆందోళన

author img

By

Published : Jul 12, 2021, 4:45 PM IST

అనంతపురం కలెక్టరేట్ వద్ద కళాకారుల ఆందోళన

కరోనాతో ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని.. రాయలసీమ కళా వేదిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద రాయలసీమ ప్రాంతంలోని కళాకారులు కన్నీటి దీక్ష చేపట్టారు. వివిధ రూపాల్లో కళలను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన చేశారు.

రెండేళ్లపాటు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమపై ముఖ్యమంత్రి దయ చూపాలని కోరారు. కళాకారులకు పింఛన్ మంజూరు చేయించి, ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, కళాకారులు కార్డులను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

CM: మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.