అనంతపురం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బూదగవిలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచి బారులు తీరారు. రథసప్తమిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. హోమం తదితర పూజల అనంతరం ఉభయ దేవేరులతో సూర్యభగవానుడి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. రథ సప్తమిని పురస్కరించుకుని సూర్య భగవానుడి ఆలయప్రాంగణంలో నిస్వార్థ, ఆయుర్ సంస్థ ప్రతినిధులు సంయుక్తంగా సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు నిర్వహించారు.
బూదగవిలో ఘనంగా రథసప్తమి వేడుకలు - rathasaptami celebrations news in budhagavi
అనంతపురం జిల్లా ఉరవకొండలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బూదగవిలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు బారులు తీరారు.
![బూదగవిలో ఘనంగా రథసప్తమి వేడుకలు బుధగవి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5917931-891-5917931-1580539486888.jpg?imwidth=3840)
అనంతపురం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బూదగవిలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచి బారులు తీరారు. రథసప్తమిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. హోమం తదితర పూజల అనంతరం ఉభయ దేవేరులతో సూర్యభగవానుడి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. రథ సప్తమిని పురస్కరించుకుని సూర్య భగవానుడి ఆలయప్రాంగణంలో నిస్వార్థ, ఆయుర్ సంస్థ ప్రతినిధులు సంయుక్తంగా సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు నిర్వహించారు.
ఇదీ చూడండి:
రథసప్తమి వేడుకల్లో చినశేషవాహనంపై తిరుమలేశుడు