Fire Accident: అనంతపురంలోని పాతూరు బోయ వీధిలోని శివ శంకర ప్రసాద్ అనే వ్యక్తి ఇంటికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పూజ గదిలో మండుతున్న దీపం వత్తిని ఎలుక తీసుకెళ్లి ఫ్రిడ్జ్ కింద పెట్టడంతో.. ఫ్రిడ్జ్ వైరుకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఫ్రిడ్జికు మంటలు అంటుకున్నాయి. ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు రావడంతో.. అప్రమత్తమైన ఇంటి యజమాని తన కుమారుడుతో కలిసి మంటలను ఆర్పారు. చుట్టుపక్కల వాళ్లు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో.. వారు చేరేలోపు మంటలు ఆరిపోయాయి. పూజరూం లో అప్పుడప్పుడు ఎలకలు దీపం వత్తులను తీసుకెళ్తుంటాయని, ఈ సారి కూడా అదే జరిగే ఉండొచ్చని గృహస్తులు వెల్లడించారు.
ఇవీ చదవండి: