ETV Bharat / state

ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం - ప్రేమ పేరుతో ఒకరు- బెదిరించి మరొకరు - Rape of a student

Rape on Btech Student in Tadipatri: ప్రేమ పేరుతో వంచించి ఓ విద్యార్థినిపై ఒకరు అత్యాచారం చేయగా... అతడితో ఏకాంతంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించి మరొకరు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

Rape_on_Btech_Student_in_Tadipatri
Rape_on_Btech_Student_in_Tadipatri
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 11:23 AM IST

Updated : Nov 4, 2023, 12:02 PM IST

Rape on Btech Student in Tadipatri : ప్రేమ పేరుతో వంచించి ఓ విద్యార్థినిపై ఒకరు అత్యాచారం చేయగా... అతడితో ఏకాంతంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించి మరొకరు లైంగిక దాడి (Sexual Assault) చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీటెక్‌ విద్యను అభ్యసిస్తోంది. ఈమెకు అదే మండలానికి చెందిన కృష్ణారెడ్డితో 5 నెలలుగా పరిచయం ఉండేది. అతడు ప్రేమిస్తున్నానంటూ (Love) వెంటపడేవాడు. ఆమెను నమ్మించడానికి బ్లేడుతో చేతిని కోసుకున్నాడు. దీంతో భయపడిన విద్యార్థిని అతడితో చనువుగా ఉండేది. అక్టోబరు 19న నిందితుడు కృష్ణారెడ్డి విజయవాడలో హాస్టల్లో ఉన్న యువతికి ఫోన్‌ చేసి బెంగళూరుకు (Bangalore) రావాలని, లేని పక్షంలో ఇద్దరి పరిచయాన్ని కుటుంబ సభ్యులకు, తెలిసిన వారికి చెబుతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి 20న బెంగళూరుకు బయలు దేరింది.

Rape attempt on deaf and dum sisters సత్యసాయి జిల్లాలో దారుణం.. మూగ, చెవిటి అక్కాచెల్లెల్లపై అత్యాచారయత్నం!

విద్యార్థినిని భయపెట్టి లాడ్జికి తీసుకెళ్లాడు : అక్కడ ఆమెను నిందితుడు కృష్ణారెడ్డి తన మిత్రుడి గదికి తీసుకు వెళ్లాడు. గదిలో ఎవరూ లేనప్పుడు బెదిరించాడు. అనంతరం అత్యాచారం చేశాడు. ఇలా 4 రోజుల పాటు లైంగిక దాడి చేశాడు. అతడి బారి తప్పించుకుని ఆమె సొంతూరుకు చేరుకుంది. తిరిగి అక్టోబరు 28న కళాశాలకు వెళ్లడానికి తండ్రితో కలిసి గుత్తి వరకు వెళ్లింది. ఆమెను అక్కడ వదిలి వెనుదిరిగాడు ఆ తండ్రి. అదే సమయంలో విద్యార్థిని సెల్ ఫోనుకు గుంతకల్లు పట్టణానికి చెందిన దివాకర్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి "బెంగళూరులో కృష్ణారెడ్డితో ఏకాంతంగా కలిసున్న వీడియోలు, ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. నేను చెప్పినట్లు వినకపోతే సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్‌ చేస్తా"నని బెదిరించి గుంతకల్లుకు రావాలి అన్నాడు. భయపడిన బాధితురాలైన విద్యార్థిని గుంతకల్లుకు వెళ్లగా.. ఆమెను స్థానికంగా ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.

Anantapur SP on gang rape case: మహిళపై అత్యాచారం ఆరోపణలపై... ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. కానీ..!

ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని : పలు మార్లు బెదిరింపులకు పాల్పడుతూ 2 రోజుల పాటు విద్యార్థినికి లైంగికంగా నరకం చూపించాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫొటోలు రహస్యంగా చిత్రీకరించాడు. వాటిని మొదటి నిందితుడు కృష్ణారెడ్డి, ఇంకొందరికి పంపాడు. ఇలా కృష్ణారెడ్డి, దివాకర్‌ వాళ్లకు తెలిసిన మిత్రులందరికి పంపించారు. ఇది తెలియని బాధితురాలు లాడ్జి నుంచి బయటపడి విజయవాడకు చేరుకుంది. ఆ వీడియోలు, ఫొటోలుఅదే మండలానికి చెందిన సుదర్శన్‌రెడ్డికి చేరడంతో.. అతడు ఆ విద్యార్థిని సమీప బంధువులకు తెలిపాడు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

వాకపల్లి అత్యాచార కేసు.. దర్యాప్తు సక్రమంగా నిర్వహించలేదన్న ప్రత్యేక న్యాయస్థానం

Last Updated : Nov 4, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.