వేసవి తాపాన్ని తట్టుకోలేక విలవిల్లాడుతున్న అనంత జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్టయ్యింది. హిందూపురంలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జోరువాన తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది.
ఈ కారణంగా పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. హిందూపురం పట్టణ, గ్రామీణ మండలంలో 110.6 మిల్లీ మీటర్లు, లేపాక్షి మండలంలో 76.4 మిల్లీమీటర్లు, చిలమత్తూరు మండలంలో 39.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇవీ చూడండి: