అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం వేకువజామున అకాల వర్షం కురిసింది. మామిడి, చింత, మిరప, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం వల్ల మామిడి పూత, పిందె రాలిన కారణంగా.. దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
చింతపండు కాపునకు వచ్చిన కారణంగా.. నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు వాపోయారు. బ్యాడిగి మిరప సాగు చేసిన రైతులు వర్షం వల్ల రంగుమారి బహిరంగ మార్కెట్లో డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని అవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: