తుపాను వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు. తుపాను ప్రభావం వల్ల జిల్లాలో నేడు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు(Rain alert to Anantapuram district). గత మూడు రోజులుగా ప్రమాదకర ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించి ప్రజలకు పలు సూచనలు చేశారు. నదులు, చెరువుల పరివాహక ప్రాంతాలలోని ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, జలమయమయ్యే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థ భవనాలు, పాత ఇళ్లల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని కోరారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, ఫైర్ , మున్సిపల్ విభాగాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అత్యవసర పరిస్థితులలో సహాయం కోసం డయల్ - 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 08554275333 నెంబర్లకు సమాచారం అందిచాలని కోరారు.
ఇదీ చదవండి: BUILDING COLLAPSE: తిరుపతిలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. పరుగులు తీసిన స్థానికులు