అనంతపురం జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో రోజు రోజుకి కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో పుట్టపర్తి ప్రశాంతి నిలయం సత్యసాయి మహాసమాధి ప్రత్యక్ష దర్శనాలు నిలిపివేస్తున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వర్గాలు ప్రకటించాయి. బుధవారం నుంచి ప్రశాంతి నిలయం మూసి వేస్తునట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపారు. సత్యసాయి మహా సమాధి దర్శనం కోసం ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
సత్యసాయి భక్తులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని మహా సమాధికి యధాప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సమాధి దర్శనం ఆన్లైన్లో మాత్రమే జరగనున్నట్లు ట్రస్ట్ సభ్యులు స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గిన తర్వాత ప్రభుత్వం నిర్ణయానుసారం.. మహా సమాధి దర్శనం పునఃప్రారంభిస్తామని తెలిపారు. అంతవరకు ఎవరూ మహా సమాధి దర్శనం కోసం రావొద్దనీ.. ఇంటి దగ్గరే ఉంటూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: