ETV Bharat / state

'కేసులు పెరుగుతున్నాయి.. మెరుగైన సేవలు అందించండి'

కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఐ, సీపీఎం ఆందోళన చేపట్టాయి. రోజుకు 7 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారన్నారు.

ananthapuram district
అసలే కేసలు పెరుగుతున్నాయి.. మెరుగైన సేవాలు అందించండి
author img

By

Published : Jul 27, 2020, 8:31 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రభుత్వం వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్​ 19 ఫస్ట్ లైన్ వారియర్స్ కు అన్ని సౌకర్యాలు కల్పించాలని రాయదుర్గం తాలుకా సీపీఐ కార్యదర్శి ఎం. నాగార్జున డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రోజుకు 7 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. కరోనా మరణాలు 1000 కి పైగా దాటాయని, కరోనా వ్యాప్తిలో 15వ స్థానంలో ఉన్న ఏపీ నాలుగు నెలల పరిధిలో 4 వ స్థానానికి చేరుకోవడం దారుణమని అన్నారు. ఆస్పత్రిలో, క్వారంటైన్ కేంద్రాలలో రోగులకు సరైన పౌష్టికాహారం అందటం లేదనే వార్తలు వస్తున్నాయని.. రోగులందరికీ సకాలంలో పౌష్టికాహరం అందించాలని కోరారు.

హోమ్ క్వారంటైన్ లో ఉన్న రోగులకు నెలకు 7500 రూపాయలను అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మన రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు సరిగ్గా అందక కరోనా రోగులు నిస్సహాయులుగా ఉండి పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రోగులకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు సైతం అందించకపోవటం.. వాటికోసం వైద్య సిబ్బంది నిరసనలు తెలపడం దురదృష్టకరమని తెలిపారు. ప్రభుత్వం ఒక వైపు కరోనా కట్టడికి అత్యధికంగా బడ్జెట్ ను కేటాయిస్తున్నామని చెబుతున్నా, ఆచరణలో అ సొమ్ము కరోనా రోగులకు చేరడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం డివిజన్ సీపీఎం కార్యదర్శి మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి శివ సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి అంధ ప్రేమికులు... అంగరంగ వైభవంగా ఒక్కటయ్యారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.