లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.పదివేలు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా గుంతకల్లులో సీపీఐ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. పట్టణంలో పనులు చేస్తూ జీవనం సాగించే కూలీలు, కార్మికులు ఉపాధి లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందునe... వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే నివసిస్తున్న కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించడం అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికులను ఆదుకునే వరకు మౌన దీక్షలు విరమించబోమని సీపీఐ జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు.
ఇదీచదవండి.