ETV Bharat / state

Protest Against Chandrababu Arrest in AP: చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు..రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు - చంద్రబాబు కోసం రక్తంతో సంతకాల సేకరణ

Protest Against Chandrababu Arrest in AP: చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు.. కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, దీక్షలు చేపట్టిన పార్టీ శ్రేణులు, ప్రజలు చంద్రబాబుపై పెట్టిన కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి సంఘీభావంగా పలుచోట్ల జనసేన, టీడీపీ నేతలు కాగడాల ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. అక్రమ అరెస్ట్‌లకు మూల్యం చెల్లించుకోకతప్పదని.. వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Protest_Against_Chandrababu_Arrest_in_AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 9:50 AM IST

Protest Against Chandrababu Arrest in AP: చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు..రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు

Protest Against Chandrababu Arrest in AP : చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. నెల్లూరులో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. బాబుకు తోడుగా చేపట్టిన రిలే దీక్షలో ఆయన రక్తంతో సంతకం చేశారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్‌ చేసి ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని ప్రభుత్వానికి హితవు పలికారు. ఆత్మకూరు పురపాలక బస్టాండ్‌లో చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ.. ఎమ్మెల్యే ఆనం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. చంద్రబాబు జైలులో ఉన్న ఫొటోలు, వీడియోలు చూస్తూ జగన్‌ పైశాచికం ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Leaders Relay Hunger Strike for Against CBN Arrest : చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ రాయలసీమ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ రిలే నిరాహార దీక్ష చేశారు. జగన్‌ దుర్మార్గపాలన నుంచి రాష్ట్ర ప్రజలను విముక్తి చేసేందుకు జనసేన, తెలుగుదేశం కలసి పని చేస్తాయని అన్నారు. చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ వైఎస్సార్‌ జిల్లాలో తెలుగుదేశం నేతలు ఆందోళనలు కొనసాగించారు. కమలాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు.

IT Employees Protesting Chandrababu Arrest : చంద్రబాబుకు మద్దతుగా మళ్లీ ఆందోళనకు సిద్ధమైన ఐటీ ఉద్యోగులు.. అనుమతి లేదన్న పోలీసులు

పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్‌ రవి ఆధ్వర్యంలో సింహాద్రిపురం, పులివెందుల నేతలు రిలే నిరాహరం దీక్షలు చేశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి జగన్‌ రెడ్డి నియంతపాలన చేస్తున్నారని బీటెక్‌ రవి మండిపడ్డారు. చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి జగన్ ఓర్వలేక అక్రమ కేసులు బనాయించారని సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆరోపించారు.

నియంతపై పోరాటం కోసం చంద్రబాబుకు తోడుగా మేము సైతం అంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు తానే సమాధి కట్టుకున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఇంటి వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

చంద్రబాబుకి మద్దతు తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేశారు. జగన్‌ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని... తెదేపా అధికారంలోకి రాగానే తగిన బుద్ధి చెబుతామని మాజీమంత్రి పీతల సుజాత హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ తెదేపా అగ్నికుల క్షత్రియ విభాగం నరసాపురం వశిష్ట గోదావరిలో జలదీక్ష చేశారు.

TDP Cadre Protest in AP: చంద్రన్న అరెస్ట్​కు నిరసనగా కదిలిన ఆంధ్రప్రదేశ్

జగన్‌ అధికార బలంతో చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఖండించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన నిరాహార దీక్షలో బండారు పాల్గొన్నారు. చంద్రబాబుకి సంఘీభావంగా అనకాపల్లిలో తెదేపా, జనసేన పార్టీ నేతలు కాగడాల ప్రదర్శన చేపట్టారు.

జగన్​కి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా బొబ్బిలిలో టీడీపీ మహిళలు నిరాహార దీక్షలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ... పార్వతీపురం జిల్లా కేంద్రం ప్రధాన రహదారి వద్ద అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా తమ అధినేతను విడుదల చేసే వరకు వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబుకి మద్దతుగా నినాదాలు చేశారు.

Womens Protest Against Chandrababu Arrest in Vijayawada: 'బాబుతో మేము సైతం'.. విజయవాడలో ధ్వజమెత్తిన మహిళలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.