అనంతపురం జిల్లా మడకశిర మండలం మెశవాయి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిని పరిశీలించేందుకు నోడల్ అధికారి, మండల విద్యాధికారి, మండల ప్రజా పరిషత్ అధికారి వచ్చారు. సిమెంట్ బస్తాల్లో 100 బస్తాలు తేడా వచ్చాయని... ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించగా.. వర్షం వస్తే సిమెంట్ బస్తాలు తడిసి పాడవుతాయని మరొక చోట ఉంచానని సమాధానం చెప్పాడు. ఈ విషయంపై నోడల్ అధికారి జిల్లా విద్యాధికారికి నివేదిక పంపారు. నివేదికను పరిశీలించిన జిల్లా విద్యాధికారి.. అనుమతి లేకుండా సిమెంటు బస్తాలను మరొక చోటికి చేర్చినందుకు ప్రధానోపాధ్యాయుడుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: కేంద్ర ఎన్నికల అధికారులతో రఘురామకృష్ణరాజు భేటీ