ETV Bharat / state

విధుల్లో నిర్లక్ష్యం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగులపై వేటు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వజ్రకరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను డీఎం​హెచ్​వో డాక్టర్​ అనిల్​ కుమార్ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎం​హెచ్​వో తెలిపారు. వజ్రకరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఎం​పీహెచ్​ఈవో శ్రీరాములు, ఏఎన్​ఎం​ పద్మావతిపై సస్పెన్షన్ వేటు పడింది.

విధుల్లో నిర్లక్ష్యం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగులపై వేటు
విధుల్లో నిర్లక్ష్యం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగులపై వేటు
author img

By

Published : Jun 10, 2020, 6:59 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ వజ్రకరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీపర్పస్​ హెల్త్ ఎక్స్​టెన్షన్ ఆఫీసర్​గా పనిచేస్తున్న శ్రీరాములు విధులకు తరచూ గైర్హాజరు అవుతున్నారని కలెక్టర్​కు ఫిర్యాదులు అందాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో.. ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదని అతనిపై ఆరోపణలు వచ్చాయి.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతన్ని విధుల నుంచి సస్పెండ్​ చేయాలని కలెక్టర్ డీఎం​హెచ్​వోను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించినందుకు శ్రీరాములుతో పాటు అదే కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్​ఎం​ పద్మావతిని కూడా సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి : ఆంగ్లం రాక.. కరోనా వచ్చింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.