ETV Bharat / state

నిండు గర్భిణి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్న కుటుంబీకులు - ధర్మవరంలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఓ నిండు గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కొవిడ్ పరీక్షల పేరుతో... చికిత్సకు ఆలస్యం చేశారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Pregnant woman dies due to doctors negligence in darmavaram at ananthapur district
వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి
author img

By

Published : Sep 10, 2020, 6:57 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని దేవి నర్సింగ్ హోమ్​లో నీలిమ అనే గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నీలిమ మృతి చెందిందని కుటుంబ సభ్యులు సీపీఐ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. నెలలు నిండిన నీలిమను కుటుంబ సభ్యులు దేవి ఆస్పత్రికి తీసుకువచ్చారు. కోవిడ్ పరీక్షలు చేయించుకుని వస్తేనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని ఆసుపత్రి సిబ్బంది వారికి తెలిపారు.

ఇందిరమ్మ కాలనీలో ప్రైవేటు ల్యాబ్​లో పరీక్షలు చేయించగా... నెగిటివ్ ఫలితాలు వచ్చాయని కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. అయినా వారు నీలిమను చేర్చుకోవటంలో జాప్యం చేసిన కారణంగా... మృతి చెందినట్లు నీలిమ తల్లి రామలక్ష్మి ఆరోపించారు.

పురిటి నొప్పులతో బాధపడుతున్న నీలిమకు నొప్పులు అధికం కాగా... ఆసుపత్రి సిబ్బంది స్కానింగ్ చేశారు. కడుపులో బిడ్డ మృతి చెందిందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని దేవి నర్సింగ్ హోమ్ సిబ్బంది నీలిమ కుటుంబసభ్యులకు తెలపారు. అప్పటికే నీలిమ సైతం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

శ్రావణి కేసులో సీరియల్​ మలుపులు... కీలకంగా మారిన కాల్​ రికార్డింగ్స్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.