ETV Bharat / state

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు

దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్​లోని రైల్వే స్టేషన్ పరిధిలో కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధాని మోదీ సంకల్పించిన జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొని కరోనా వైరస్ నుంచి దేశాన్ని కాపాడాలంటూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చేవారిని పరికరాలతో క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్​ లక్షణాలు కనిపించిన వారిని పరీక్షించేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు
author img

By

Published : Mar 22, 2020, 9:28 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్​లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వైరస్ నుంచి ప్రయాణికులను కాపాడటానికి స్టేషన్ పరిసరాలను ఎప్పటికపుడు డిటర్జెంట్ సబ్బులు, ఇతర సామగ్రిని ఉపయోగించి ప్లాట్ ఫామ్​లను శుభ్రపరుస్తున్నారు. అధికారులు ఎప్పటికపుడు ఆరా తీస్తున్నారు. రైల్వే స్టేషన్​ పరిసరాల్లో రసాయన వాయువులు చల్లుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 17 ప్రత్యేక రైళ్లను ఇప్పటికే నిలిపివేశారు. రద్దీగా ఉండే రైల్వే ఆట స్థలాలు, ఇన్​స్టిట్యూట్, టెన్నిస్ కోర్ట్, వివాహ వేదికలు, పార్కులు మార్చ్ 31 వరకు మూసివేశారు. రైల్వే ప్లాట్​ ఫామ్​లపై రద్దీని తగ్గించడానికి టికెట్ ధర రూ.50 పెంచుతూ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు.

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్​ స్టేషన్​కు వచ్చే ఫిర్యాదు దారులకు కరోనాపై ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. డెటాల్ కలిపిన నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు దగ్గరుండి నీటిని అందజేస్తున్నారు. వీధుల్లో ఉండే పోలీసులు మాస్కులు ధరిస్తున్నారు. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే శుభ్రత పాటించాలని తెలిపారు. ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూను పాటించాలని ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

కరోనా ఎఫెక్ట్​ : వాల్తేర్ డివిజన్​లో 36 రైళ్లు రద్దు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.