'వన్యప్రాణులను ఫొటోలు, వీడియోలు తీస్తే చర్యలు తప్పవు' - బోదపల్లిలో మేకల మందపై చిరుత దాడి
వన్యప్రాణులను ఫొటోలు, వీడియోలు తీస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. కుందుర్పి మండలం బోదపల్లిలో ఆనంద్ అనే వ్యక్తికి చెందిన మేకల మందపై చిరుత దాడి చేసింది. మేకను చంపేసిన తర్వాత సేదతీరుతున్న పులిని రైతులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు... రైతులను హెచ్చరించారు. వన్యప్రాణులను ఫొటోలు, వీడియోలు తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.