అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 434 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 46 మద్యం సీసాలు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఎవరైనా మద్యం రవాణా చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇది సంగతి: