అనంతపురం జిల్లా నార్పల క్రాసింగ్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. బొలెరో వాహనంలో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. వీరి వద్ద నుంచి 53 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి...