అనంతపురంలోని ఆ ప్రభుత్వ క్లబ్ పేకాటకు అడ్డాగా మారింది. గడిచిన 20 ఏళ్లలో ఏ పోలీసు అధికారి సాహసించి దాడులు నిర్వహించిన దాఖలాలు లేవు. ఎస్పీ దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నగరంలోని క్లబ్‌పై ప్రత్యేక బృందాలతో మెరుపు దాడి చేయించారు. నగదు బెట్టింగులతో పేకాట ఆడుతున్న 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. లక్షా 87 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
పలువురు ప్రముఖులు...
మామూలుగా ఆ క్లబ్ వంక కూడా కన్నెత్తి చూడని పోలీసులు, ఒక్కసారిగా మెరుపుదాడి చేయటంతో పేకాట ఆడుతున్న వారు ఒక్కసారిగా హడలిపోయారు. ఏ ఒక్కరినీ వదలకుండా, పోలీసులు అందరిపై కేసులు నమోదుచేసి కోర్టు ఎదుట నిలబెట్టారు. పట్టుబడిన పేకాట రాయుళ్లలో పదవీవిరమణ పొందిన అధికారులతోపాటు, పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 15 క్లబ్‌లను గుర్తించి, అన్నిచోట్లా దాడులు చేశామని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు.
ఇవీ చదవండి... ఆరేళ్ల చిన్నారిపై.. 40 ఏళ్ల కామాంధుడి అత్యాచారం