ఓ వ్యక్తి ఫోన్ కాల్.. అనంతపురం పోలీసులను పరుగులు పెట్టించింది. నాగభూషణం అనే వ్యక్తిపై నాయక్ నగర్లో కొంతమంది దాడి చేస్తున్నారని సీఐ జాకీర్ హుస్సేన్‌కు ఫోన్ వచ్చింది. అతడి కోసం పోలీసులు వీధులన్నీ గాలించారు. చివరికి ఆ వ్యక్తిని పట్టుకుని విచారణ జరపగా.. తనపై దాడి జరగలేదని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఫోన్ చేసిన వ్యక్తిని ప్రశ్నించగా.. దాడి చేయలేదని, కేవలం తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నలుగురు వ్యక్తులు కలిసి మాట్లాడారని తెలిపాడు. భయంతో ఫోన్ చేసినట్లు వెల్లడించాడు. తప్పుడు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. స్థానిక నాయకులను పిలిపించి సీఐ హెచ్చరించారు. తమ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: