అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహన్ని నెలకొల్పారు. విగ్రహం ఆవిష్కరణకు వైకాపాలోని కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు చెందిన ఒక వర్గం, ఎంపీ రంగయ్యకు చెందిన మరో వర్గం వేరు వేరు తేదీలు ఖరారు చేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య కొద్ది కాలంగా పలు విషయాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కంబదూరులోని అంబేడ్కర్ విగ్రహాన్ని ఇరు వర్గాల వారు ఆవిష్కరించాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ సందర్భంగా గొడవలు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు విగ్రహం ముందు సిబ్బందిని కాపలా ఉంచారు. ఈ విషయంపై కళ్యాణదుర్గం సీఐ శివ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఇరువర్గాలవారు ఒకే తేదీని నిర్ణయించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: