కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద కర్ణాటక రాష్ట్రం వైపు నుండి వచ్చే వాహనాలను ఆపి మాస్కు వినియోగించాలని, శానిటైజర్ వాడాలని సూచిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు దేవనహళ్లి విదేశీ విమానాశ్రయం ఈ చెక్‌పోస్ట్‌కు సమీపంలో ఉండడం చేత ఎవరైనా విదేశాల నుంచి వస్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. అలా వచ్చే వారిని గుర్తించి 15 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: