హైదరాబాద్కు చెందిన దంతవైద్యుడు హుస్సేన్ని మంగళవారం సాయంత్రం కొంత మంది దుండగులు కిడ్నాప్ చేశారు. హుస్సేన్ వైద్య వృత్తితో పాటు స్థిరాస్థి వ్యాపారం చేసేవాడు. వైద్యుడి కిడ్నాప్ సమాచారం అర్థరాత్రి అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసు బాబుకు రావటంతో ఆయన పోలీసు బృందాలను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్లు అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్తుండగా.. రాత్రి నుంచే 44వ జాతీయ రహదారిపై నిఘా ఏర్పాటు చేసి రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లను పట్టుకున్నారు. వైద్యున్ని సురక్షితంగా రక్షించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. అదుపులో తీసుకున్న ఇద్దరిని పోలీసులు రాప్తాడు మండలం బుగ్గచర్లలోని వ్యవసాయ క్షేత్రాల్లో విచారణ చేస్తున్నారు. రూ.10కోట్లు బిట్ కాయిన్ల రూపంలో ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఇదీచదవండి