ETV Bharat / state

వాలంటీర్లను చితకబాదిన పోలీసులు...ఎందుకంటే..! - Anantapur district updates

అనంతపురం గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులకు, యువకులకు మధ్య వివాదం జరిగింది. ఈ వివాదం జరిగిన రెండు రోజుల తరువాత తమను పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి... కొట్టారని బాధిత యువకులు ఆరోపించారు. అస్వస్థతకు గురైన యువకులను గ్రామస్థులు.. ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితుల్లో ఇద్దరు వ్యక్తులు వాలంటీర్లుగా పని చేస్తున్నారు.

వాలంటీర్లపై పోలీసులు దాడి
వాలంటీర్లపై పోలీసులు దాడి
author img

By

Published : Sep 14, 2021, 8:59 PM IST

వాలంటీర్లపై పోలీసులు దాడి

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు, యువకుల మధ్య వివాదం చెలరేగింది. నిమజ్జనం జరిగిన రెండు రోజుల తరువాత తమను పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లి కొట్టారని యువకులు ఆరోపించారు. అస్వస్థతకు గురైన ముగ్గురు యువకులను గ్రామస్థులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు తిక్కస్వామి, గణేష్​లు గ్రామంలో వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తుండగా.. మరో యువకుడు రామాంజనేయులుగా గుర్తించారు.

సీఐ, ఎస్ఐ పిలుస్తున్నారని చెప్పి తీసుకెళ్లి.. వారు లేని సమయంలో స్టేషన్​లో పోలీసులు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తమను కులం పేరుతో దూషించి.. అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పట్టణ సర్కిల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.