ETV Bharat / state

బతికుండగానే చంపేసి.. ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేస్తున్న ముఠా

Insurance Claim with Fake Certificates: బతికుండగానే చనిపోయినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి.. లక్షలు విలువ చేసే ఇన్సూరెన్సులను క్లయిమ్ చేసేవాళ్లు.

Gang arrested for making fake certificates
నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు
author img

By

Published : Mar 21, 2023, 9:22 PM IST

Insurance Claim with Fake Certificates: వాళ్లంతా వివిధ పనులు చేసుకుంటూ ఉండేవారు. అంతా ఒక్కటయ్యారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం ఏకంగా బతికున్న వారినే.. చనిపోయినట్టు సృష్టించడం మొదలుపెట్టారు. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా చేసేవారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తులు బతికి ఉండగానే.. చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, డాక్టర్ సర్టిఫికెట్, ఫోటోలు మార్పిడి చేసిన పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లతో ఇన్సూరెన్స్ డబ్బులు క్లైమ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ముఠా వద్ద నుంచి కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు తాడిపత్రి డీఎస్పీ చైతన్య పేర్కొన్నారు. తాడిపత్రిలోని హరిజనవాడకు చెందిన గిత్త రంగనాయకులు.. ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసేవాడు. శాంతమ్మ అనే మహిళకు 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేసి.. కంపెనీని మోసం చేశాడు. శాంతమ్మ బతికుండగానే.. మృతి చెందినట్లు నకిలీ సర్టిఫికెట్ సృష్టించి డబ్బులు కాజేశాడు.

ఇన్సూరెన్స్ అధికారుల విచారణలో భాగంగా రంగనాయకులు అనే వ్యక్తికి ఫోన్ చేయగా.. అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో సచివాలయానికి వెళ్లి విచారణ చేశారు. విచారణలో శాంతమ్మ అనే మహిళ బతికే ఉందని.. డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతో ఏజెంట్ ఇలా చేశాడని ఇన్సూరెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో సదరు ఇన్సూరెన్స్ అధికారులు తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విచారణలో రంగనాయకులతో పాటు గురుశేకర్, చింతలయ్య గారి రంగనాయకులు, చంద్రశేఖర్, గౌర్ స్పీర్ అంతా కలిసి.. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి మోసగిస్తున్నారని గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ చైతన్య పేర్కొన్నారు

బతికుండగానే డెత్ సర్టిఫికెట్.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భారీ స్కెచ్

"తాడిపత్రి టౌన్​లో వచ్చిన ఫిర్యాదు మేరకు.. ఒక నకిలీ ఇన్సూరెన్స్ ముఠాను అరెస్టు చేశాం. దీంట్లో భాగంగా వీరు.. ఎవరైతే ఇన్సూరెన్స్​లు కడతారో వారికి ఏజెంట్​గా ఉన్న గిత్తా రంగనాయకులు అనే వ్యక్తి మోసం చేస్తున్నాడు. వారు బతికుండగానే చనిపోయినట్లు.. వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా నామినీలను మారుస్తున్నారు. శాంతమ్మ అనే మహిళ 2021 డిసెంబర్​లో చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేశారు. ఆవిడ కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు 20 లక్షలు రావాల్సి ఉంది. ఇన్సూరెన్స్ వాళ్లు చెకింగ్​కి రావడంతో విషయం బయటకు వచ్చింది". - వీఎన్​కే చైతన్య, డీఎస్పీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.