వైకాపా కార్యకర్త ఫిర్యాదుతో అనంతపురం జిల్లా పోలీసులు.. ఉగాండాలో ఉండే యువకుడి తండ్రిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఉగాండా దేశంలో ఉంటున్న ఓ యువకుడు వైకాపా ఎమ్మెల్యేని అవమానించేలా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారంటూ ఓ వైకాపా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 ఏళ్లున్న ఆ యువకుడి తండ్రిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
ఉగాండాలో ఉంటున్న తెలుగుదేశం సానుభూతిపరుడైన ఓబుళారెడ్డి.. కదిరి ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తమ ఎమ్మెల్యేని కించపరుస్తూ పోస్టు పెట్టారంటూ.. వైకాపా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే స్పందించి.. నంబులపూలకుంటలో నివాసముండే యువకుడి తండ్రిని విచారణ పేరిట కదిరికి తీసుకొచ్చారు. కుమారుడు పోస్ట్ చేస్తే.. తండ్రిని స్టేషన్‌కు పిలవడంపై.. తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పేస్బుక్ అంటేనే తెలియదని ఆ యువకుడి తండ్రి చెబుతున్నారు.
ఇదీ చదవండి: