అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో శ్రీరామ్‌రెడ్డి నీటి పథకానికి సంబంధించిన పైపులైన్ లీక్ అయ్యి నీరు వృథాగా పోతోంది. కళ్యాణదుర్గం నుంచి ఖమ్మం వరకు వెళ్లే ప్రధాన రహదారిలో కస్తూర్భా పాఠశాల భవన సముదాయాల ముందు పైప్‌లైన్ ధ్వంసం అయ్యింది. నీరు పైకి జిమ్ముతూ ఫౌంటెయిన్‌లా మారింది.
సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు నీటి పంపిణీని నిలిపివేసి.. మరమ్మతులు చేసేందుకు సమాయత్తమయ్యారు. పైపులైన్‌కు లీక్ ఏర్పడటం వల్ల ఒకట్రొండు రోజులు కంబదూరు ప్రాంతం వైపు ఉన్న గ్రామాలకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: