ETV Bharat / state

పంట రక్షణ కోసం.. పులి వేషంలో పెంపుడు కుక్క - అనంతపురం జిల్లా తాజా వార్తలు

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామ రైతులు వినూత్నంగా ఆలోచించారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుతునేందుకు చిరుత వన్నె శునకం తయారు చేశారు. పెంపుడు శునకానికి చిరుతలా మచ్చలు పెట్టి పొలంలో వదిలారు. అప్పటి నుంచి దానికి భయపడి అడవి జంతువులు రావట్లేదని... రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

pet dog guarding crops in tiger attire at anathapuram
పంట రక్షణ కోసం.. పులి చర్మంతో పెంపుడు కుక్క
author img

By

Published : Dec 15, 2020, 12:43 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామంలో రైతులు అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలోని ఓ పెంపుడు శునకానికి చిరుత పులిలా మచ్చలు వేశారు. దానిని చూసిన అడవి జంతువులు భయపడి పారిపోతున్నాయి.

పంట రక్షణ కోసం.. పులి చర్మంతో పెంపుడు కుక్క

ఆ కుక్క యజమానురాలు, పక్క పొలం మహిళా రైతులు మాట్లాడుతూ గ్రామంలో పంటలకు కోతులు, అడవి జంతువుల, పక్షుల నుంచి రక్షించుకునేందుకు వినూత్నంగా ఆలోచించి పెంపుడు కుక్కకు పులి చారలు వేశామని అన్నారు. ఆ కుక్కుని చూసి కోతులు, పక్షులు భయంతో అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. వినూత్న ఆలోచనతో పంటలను సంరక్షించుకున్నామని, ఈ సందర్భంగా పంటలను కాపాడుతున్న కుక్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తొలిసారిగా ట్యాబ్‌లతో గ్రూప్-1 మెయిన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.