ETV Bharat / state

ఇంధన భారం .. అన్ని వర్గాలపైనా ప్రభావం - అనంతపురం జిల్లా వార్తలు

అనంతపురం జిల్లాలో 16 వేల హెక్టార్లలో టమోటా సాగు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్లలో కిలో రూ.25-30 మధ్య పలుకుతుండగా.. మదనపల్లి మార్కెట్‌లో రూ.36 ధర పలుకుతోంది. అయితే పంటను అనంతపురం నుంచి మదనపల్లికి తీసుకెళ్లాలంటే రవాణా ఖర్చులు పెరిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

transport
transport
author img

By

Published : Jul 8, 2020, 10:03 AM IST

ఓవైపు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అన్నివర్గాలు కుదేలయ్యాయి. మరోవైపు ఇంధన ధరలు పెనుభారంగా మారాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం రవాణా రంగంపై చూపుతోంది. నెలరోజుల్లో లీటరు డీజిల్‌పై రూ.9.64, పెట్రోలు రూ.8.34 పెరిగింది. దీంతో సరకు రవాణా వాహనాలకు 10 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఎగుమతులు కష్టమే

ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులకు జిల్లా పెట్టింది పేరు. గనులు, క్వారీలు అధికమే. తాడిపత్రిలో లభించే నాపరాతి బండలు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతున్నాయి. రాయదుర్గం, పామిడి ప్రాంతాల నుంచి జీన్స్‌, వస్త్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర పట్టణాలకు రవాణా జరుగుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పుడిప్పుడే ఆయా వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇంధన ధరల ప్రభావం ఎగుమతులపై పడుతోంది. గతంతో పోలిస్తే రవాణాకు 10 శాతం అదనంగా వెచ్చించాల్సి వస్తోందని వ్యాపారులు, రైతులు వాపోతున్నారు.

సామాన్యులపై పిడుగు

పెట్రో, డీజిల్‌ ధరల ప్రభావం సామాన్యులపైనా చూపుతోంది. సరకులు, కూరగాయలు రవాణా చేసే వాహనాల బాడుగలు పెంచారు. దీంతో ఆయా సరకుల ధరలు కొండెక్కుతున్నాయి. నిత్యావసరాలు, కూరగాయలు, భవన నిర్మాణ సామగ్రి తదితరాల ధరలూ పెరుగుతూ వస్తున్నాయి. ఆటోలు, కార్లు నడిపి జీవించే వారి పరిస్థితి దయనీయంగా మారింది. వచ్చే సంపాదన డీజిల్‌, పెట్రోల్‌ ఖర్చులకే సరిపోతోందని చోదకులు చెబుతున్నారు. వాహనాల కంతులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ప్రజారవాణా స్తంభించడంతో దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పలువురు సొంత వాహనాలపై వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.

పరిస్థితి దయనీయం

లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలు వాహనాలు తిప్పలేకపోయాం. లోడింగ్‌లు గతంతో పోలిస్తే బాగా తక్కువగా వస్తున్నాయి. దీనికితోడు పెరిగిన ఇంధన ధరలు లారీల యజమానులకు గుదిబండగా మారాయి. దూర ప్రాంతాలకు వెళ్లి రావాలంటే లారీలకు కొన్ని పరికరాలు మార్చాల్సి ఉంటుంది. ఈ ఖర్చులకు తోడు ఇంధన ధరలు భారంగా మారాయి. - నాగభూషణం, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

పంట తరలింపు కష్టమే

కర్ణాటక సరిహద్దున ఉన్న రొద్దం మండలం నుంచి జిల్లా కేంద్రానికి టమోటాలు తీసుకొస్తున్నా. గతంలో రూ.9 వేలకే వాహనం బాడుగకు వచ్చేది. ఇప్పుడు డీజిల్‌ ధరలు పెరిగాయి. రూ.10 వేలు ఇవ్వాలని వాహన యజమాని అడుగుతున్నారు. వచ్చేదే అరకొర లాభాలు. ఆదాయం బాడుగకే సరిపోతే బతికేదెలా? - రవీంద్రనాథ్‌, రైతు, రొద్దం

లారీ తిప్పితే నష్టాలే

నాకు లారీ ఉంది. కరోనా వల్ల 3 నెలలు తిప్పలేకపోయా. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత నుంచి డీజిల్‌ ధరలు పెంచుతూ పోతున్నారు. వాహనం తిప్పాలంటే భయపడాల్సి వస్తోంది. తిప్పకుంటే కంతులు కట్టలేం. తిప్పితే నష్టాలను భరించలేం. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. - ఈశ్వర్‌, లారీ డ్రైవర్‌, హిందూపురం

ఇదీ చదవండి: విద్యారంగంలో మేలిమి సంస్కరణలు అవసరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.