ETV Bharat / state

Water Problems: తాగునీటి కోసం 'అనంత' కష్టాలు.. నీళ్లున్నా అందని చిత్రం - అనతంపురం జిల్లా నీటి కటకట

Water problems: అనంతపురం జిల్లాలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. గతేడాది వర్షాలు బాగా కురిసి భూగర్భజలాలు పెరిగినప్పటికీ..తాగునీటి సరఫరాకు తగిన ఏర్పాటు చేయలేకపోయారు. గ్రామీణ తాగునీటి పథకాలకు సంబంధించిన బోర్లలో నీరున్నా.. మోటార్లు పని చేయటం లేదు. బోర్ల మరమ్మతులకు నిధులు లేకపోవటంతో.. పలుచోట్ల నీరున్నా..ప్రజలకు అందించలేని పరిస్థితి నెలకొంది.

Water problems
అనంతపురం జిల్లాలో తాగు నీటి సమస్యలు
author img

By

Published : Apr 11, 2022, 1:57 PM IST

అనంతపురం జిల్లాలో తాగు నీటి సమస్యలు

Water problems: అనంతపురం జిల్లాలోని 38 గ్రామాల్లో మార్చి నెల ప్రారంభం నుంచే తాగునీటి సమస్య మొదలైంది. సత్యసాయి, శ్రీరాంరెడ్డి తాగునీటి పథకాల ద్వారా జిల్లావ్యాప్తంగా 1,260 గ్రామాలకు తాగునీరు అందుతోంది. గ్రామీణ నీటి సరఫరా పథకం కింద వివిధ గ్రామాల్లో 6వేల 450 బోర్లు ఉన్నాయి. వీటిలో 2వేల 262 బోర్లకు మరమ్మతులు చేయించాల్సి ఉంది. మూడేళ్లుగా ఆర్​డబ్ల్యూఎస్​ పథకం నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో మరమ్మతులు నిలిచిపోయాయి. ఆర్​డబ్ల్యూఎస్​ పథకం నిర్వహణకు పంచాయతీ ఖాతాలోని ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ నిధులను కూడా ప్రభుత్వం లాగేసుకోవటంతో తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది.

Water problems: గతంలో తాగునీటి సమస్య తలెత్తిన గ్రామాల్లో ... ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటి సరఫరా చేసేవారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక ట్యాంకర్ల యజమానులకు డబ్బులు చెల్లించేవారు. మూడేళ్లుగా నిధులు విడుదల కాకపోవటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం లేదు. నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని..ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా..సమస్య తీరటం లేదని ప్రజలు వాపోతున్నారు.

" మాకు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. 10-15 రోజులైనా నీళ్లు రావడంలేదు. అధికారులు పట్టించుకోవడంలేదు. కుళాయిలు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. నీటి ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేయడంలేదు. నీటి సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం."- మహిళలు

ఆర్​డబ్ల్యూఎస్​ పథకం నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవటంతో... ట్యాంకర్ల యజమానులు కూడా నీటి సరఫరాకు ముందుకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. నీటి సమస్య ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు కోటి 56లక్షల రూపాయలు అవసరం అవుతాయని.. ప్రభుత్వానికి నివేదించినట్లు గ్రామీణ నీటి సరఫరా పథకం అధికారులు తెలిపారు. నిధులు విడుదలైతే గ్రామాలకు నీటిని పంపిస్తామని చెబుతున్నారు.

" పెద్దగా నీటి సమస్యలు లేవు. కేవలం మెయింట్​నెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాదాపు మోటర్ల రిపేర్​, పైపుల మరమ్మతులు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి గ్రామపంచాయతీ చర్యలు తీసుకొంటోంది. మార్చి, ఏప్రిల్​, మే, జూన్​లలో 30 నుంచి 40 గ్రామాల వరకు నీటి సమస్య ఉంటుందని గుర్తించాం. దానికి కోసం తక్షణ ప్రత్యామ్నాయం చూపాలంటే ట్రాన్స్​పోర్ట్​ ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం నిధులు కావాలని అడిగాం"-ఎహసాన్ బాషా, ఆర్‌డబ్ల్యూఎస్ఎస్ఈ

Water problems: రోజురోజుకీ నీటి సమస్య తీవ్రమౌతోందని.. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Murder: నంద్యాలలో హోంగార్డు శేఖర్‌ దారుణహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.