పెనుకొండ పట్టణంలోని దర్గా కూడలి వద్దనున్న చిరు వ్యాపారులు శుక్రవారం నిరసన బాట పట్టారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. గత 20 ఏళ్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్న తమను రెండు రోజుల క్రితం నగర పంచాయతీ అధికారులు దుకాణాలు తొలగించాలని ఆదేశించారన్నారు. దుకాణాలు తొలగిస్తే తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :