రాష్ట్రంలో సీఏఏ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయమని ప్రభుత్వం జీవో జారీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్న కారణంతో సామాజిక మాధ్యమాల ద్వారా చిన్న పోస్టు చేసి మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనంతపురంలో విమర్శించారు. దేశంలో మమతా బెనర్జీ లాంటి వారు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశారని.. మైనార్టీలపై నిజంగా ప్రేమ ఉంటే జగన్ సర్కారు దానిని అమలు చేయమని చెప్పాలన్నారు. ఎన్ఆర్సీకి మొదటి మెట్టు ఎన్.పి.ఆర్ అని మీకు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ సర్కారు చెప్పేది ఒకటి చేసేది మరొకటని శైలజానాథ్ ఆక్షేపించారు. 3 రాజధానులకు, శాసనమండలి రద్దుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్లా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి...'ఈ 9 నెలల్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు'