కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం... రాజకీయ కక్షసాధింపే పనిగా పెట్టుకొని పనిచేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. వామపక్ష పార్టీ నేతలతో కలిసి అనంతపురం జిల్లా కలెక్టర్ను కలిసిన శైలజానాథ్ ప్రభుత్వ పనితీరు, తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఓ వైపు వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతుంటే, దీని వ్యాప్తిని కట్టడి చేసే చర్యలను వదిలేసి.... ఇతరత్రా విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. వైద్య సేవలందించే డాక్టర్లు, సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు వెంటనే సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో మాస్కులు, పరికరాలు కొరత ఉన్నాయని మాట్లాడితే వైద్యులను, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేస్తున్న నిర్ణయాలు సరైనవి కాదన్నారు. వైద్యుడు, మున్సిపల్ కమిషనర్ పై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని శైలజానాథ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చదవండి...'అనుమానాలు తలెత్తినప్పుడు మారిస్తే తప్పేంటి?'