ETV Bharat / state

చిన్నబోయిన వ్యాపారం... పెరుగుతున్న అప్పుల భారం! - మడకశిర బేకరీ దుకాణాలు వార్తలు

కరోనాతో వైరస్ ప్రభావం బేకరీ వ్యాపారంపై తీవ్రంగా ఉంది. లాక్​డౌన్​ కారణంగా కొనుగోలుదారులు లేక దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అద్దె గదుల్లో దుకాణాలు నడుపుతున్న బేకరీ దుకాణాల యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

bakery shops
bakery shops
author img

By

Published : Aug 8, 2020, 9:46 PM IST

చిన్నబోయిన వ్యాపారం... పెరుగుతున్న అప్పుల భారం!

కరోనా కాలంలో ఎన్నో వ్యాపారాలు, రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో ఒకటి బేకరీ వ్యాపారం. ప్రస్తుతం లాక్​డౌన్ మినహాయింపులతో దుకాణాలు తెరిచినా... వ్యాపారం సాగక తీవ్ర కష్టాలు పడుతున్నారు బేకరీ దుకాణాల యజమానులు. ముఖ్యంగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో బాడుగ రూముల్లో వ్యాపారాలు చేస్తున్న వారి బాధలు వర్ణనాతీతం. మార్చి నెలలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బేకరీ దుకాణాల యజమానులు కష్టాలతో కాలం గడుపుతున్నారు.

దుకాణాలు తెరిచినా...

ప్రస్తుతం లాక్​డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వటంతో కొన్ని రోజుల క్రితం బేకరీ దుకాణాలు తెరుచున్నాయి. కానీ కరోనా కేసుల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు వ్యాపారాలు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఈ కొంచెం సమయంలో వ్యాపారాలు సాగడం లేదు. మరోవైపు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు చెడిపోవటంతో... వారి పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది. అటు ఆదాయం రాకపోగా.. పెట్టిన పెట్టుబడి సైతం రావటం లేదని బేకరీ దుకాణాలు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాడుగలు చెల్లించాలంటే అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ బాధలు గుర్తించి కనీసం మధ్యాహ్నం 2 గంటల వరకు అయిన వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

అయోధ్యలో ఎలుకల గండం.. 'ఏం చేస్తే పోతాయి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.