లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి నిత్యావసర సరకులు, రూ.7500 నగదు ఇవ్వాలని.. అనంతపురం జిల్లా కదిరిలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న దేశవ్యాప్తంగా నిరసన చేపడుతున్నామని తెలిపారు.
ఇదీచదవండి.