ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో ప్రభుత్వం రాయితీపై కిలో 25రూపాయలకే పంపిణి చేపట్టింది. కదిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డల పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఉదయం నుంచి ఉల్లిగడ్డలు ఇస్తామన్న మార్కెట్ అధికారులు సమయం పొడిగిస్తూ సాయంత్రం వరకు ఇవ్వలేదు. ఉదయం వెళ్లినవారు భోజనం లేకుండా ఎదురుచూశారు. తగినంత సరుకులేన్నందున ఇవ్వలేక పోతున్నామంటూ చెప్పేసరికి... అప్పటి వరకు వేచి ఉన్న లబ్ధిదారులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సరుకులేనప్పుడు నోస్టాక్ బోర్డు ఎందుకు పెట్టలేదంటూ మార్కెట్ యార్డు అధికారులను నిలదీశారు.
ఇవీ చదవండి