అనంతపురం జిల్లా గుత్తి మండలంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణానికి చెందిన జిల్లాన్ అనే వ్యక్తి , గుత్తి మండలం అనగానదొడ్డి గ్రామంలో ఇంటి పై కప్పు పై రంగులు వేస్తుండగా గాలి వీయటంతో ప్రమాదవశాత్తు పక్కనున్న విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ...