అనంతపురం రజిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో ఇంటి పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగయ్య ఇంటి పైకప్పు దెబ్బతింది. నిన్న రాత్రి కురుసిన వర్షానికి ఇంటిపైకప్పు దిమ్మె విరిగిపోయింది. దిమ్మెను మరమ్మతు చేసేందుకు.. అదే గ్రామానికి చెందిన కృష్ణ, సత్య అనే కూలీలను పిలిపించారు. మరమ్మతులు చేస్తుండగా.. ఒక్కసారిగా కప్పు కూలిపోయింది. ఘటనలో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా.. సత్య తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం'