అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం గుంతకల్లుకు చెందిన లక్ష్మీదేవి అనే వృద్ధురాలు గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను.. కుమారుడు, కుమార్తె శుక్రవారం సాయంత్రం బస్సులో అనంతపురానికి తీసుకెళ్తున్నారు.
ఈ తరుణంలో ఉరవకొండ సమీపంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కన్నతల్లి మరణాన్ని చూసిన కొడుకు, కుమారై కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం స్థానికుల సహాయంతో ప్రైవేట్ వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.
ఇదీ చూడండి: