అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. అతను భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడని స్థానికులు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో దాతలు పెట్టే ఆహారం తింటూ బస్టాండులోనే ఉండేవాడు.
ఈ రోజు తెల్లవారుజామున వృద్ధుడు మరిణించినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అతని సొంత ఊరు ఓబులదేవరచెరువుగా పోలీసులు గుర్తించారు. బంధువుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి: