అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో వన్యప్రాణులైన చిరుతలు, ఎలుగుబంట్లు అధికంగా ఉన్నాయి. నియోజకవర్గానికి చుట్టూ కర్ణాటక అటవీ ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం కర్ణాటక ప్రాంతం నుంచి వలస వచ్చిన ఏనుగుల సమూహం పంట పొలాల్లో కనిపించింది. తిరిగి అవి అక్కడి నుంచి కర్ణాటక అటవీ ప్రాంతానికి వెళ్లిపోయాయి.
ఈ నేపథ్యంలో.. నేడు జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండల కేంద్రంలో అటవీశాఖ అధికారులు ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో వన్యప్రాణుల ఆవశ్యకతను ప్రజలకు వివరించి వాటిని ఎలా సంరక్షించుకోవాలి, వాటి దాడి నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలనే జాగ్రత్తలను అధికారులు ప్రజలకు వివరించారు.
ఇదీ చదవండి: